క్షణం ఒక యుగంగా, నిమిషం ఒక నరకంగా......

నా ప్రియమైన ప్రియురాలా,,,
                                           ఇలా నాకు ఇష్టమైన వాళ్ళతో ఇలా మాట్లాడుకోవలసి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. కానీ ఆ  రోజు రాణే వచ్చింది. నువ్వంటే ఎంత ఇష్టమో నాకు ఎలా చెప్పాలో తెలియదు. అది నా బై బర్త్ అలాగే వచ్చింది. నిన్ను ప్రేమించడం నా వరం, నువ్వు ఒప్పుకోకపోవడం నా దురదృష్టం. యుగాలు మారిన, తరాలు మారిన, నడి  సముద్రమున భూమే పుట్టిన నా మనసు మారదు. నా చూపు మారదు. ఒకానొక సందర్భం లో ఎగిసి పడే అలలను చూసి సంబరపడి పోయా.నువ్ కూడా ఇలాగే  తిరిగి వస్తావని.
                                           
                                            నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో నాకు  తెలుసు , నా మనసుకు తెలుసు. 
    నీవు లేని క్షణం ఒక  యుగంగా, నిమిషం ఒక నరకంగా,  నీరు లేని  బావిలా,  సూర్యుడు లేని  ప్రపంచంగా గడిపా.   నీ గురించి ఆలోచిస్తూ కొన్ని వందల సార్లు - కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళా, రోడ్డంతా గతుకులు, చీమలు దూరని చీకటి అయినా  ముందుకు సాగా.... అది కూడా నిన్ను తలచుకుంటూ.  ఎందుకో తెలుసు కానీ, ఏమీ  చేయలేని  వాడిలా ఉండిపోతున్నా.... అది ఎవరికో భయపడీ కాదూ ,భయపెట్టకపోవడం రాకా కాదు, అది నాకు  క్రొత్త కూడా  కాదు. అది కేవలం నీకోసమే.....
                              నేను  ప్రతిక్షణం  భయపడ్డా నావల్ల  నీకేమైనా అవుతుందని, ప్రతిక్షణం జాగ్రత్తపడ్డా .. నా వల్ల ఏదైనా ఏసమస్య వస్తుందేమోనని. నా భయమంతా నీ మీదే.... నా కనులన్ని నీ మీదే. కానీ అదేంటో నువ్ కనిపించిన ప్రతిసారీ నా గుండె రెట్టింపు వేగం తో కొట్టుకునేది... అదేంటో తెలియదు.

                                

Comments